నాణ్యమైన వైద్యం.. అత్యుత్తమ విద్య
నాణ్యమైన వైద్యం.. అత్యుత్తమ విద్య అందుబాటులో
అత్యాధునిక వైద్యం..
నగరంలోని క్లౌ పేట రైల్వే స్టేషన్ రోడ్డులో జాయ్ ఫెర్టిలిటీ సెంటర్‌లో అత్యంత ఆధునిక వైద్య పరికరాలున్నాయి. డాక్టర్ జిన్ని మాథ్యు ఇన్‌ఫెర్టిలిటీ వైద్యంలో చేయితిరిగిన వైద్యురాలిగా పేరొందారు. డాక్టర్ నోయల్ జాన్ యూరో ఆండ్రాలజిస్టుగా సేవలందిస్తున్నారు.
● కర్నూలు రోడ్డులోని విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో సంతాన సాఫల్యంలో సుశిక్షితులైన డాక్టర్ కొండారెడ్డి రాధిక వైద్య సేవలందిస్తున్నారు.
● ఫెర్టి కేర్ ఐవీఎఫ్ సెంటర్‌లో సంతాన సాఫల్యం కోసం ఆధునిక వైద్య చికిత్స చేస్తున్నారు.
● ఎన్జీఓ కాలనీలో అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీర్ణకోశ, శ్వాసకోస క్యాన్సర్ నిర్ధారణలో డాక్టర్ మందలపు నరేంద్ర బాబు పేరుతెచ్చుకున్నారు. పల్మనాలజీ చికిత్సలో డాక్టర్ ఎన్.భానుతేజ చికిత్స అందిస్తున్నారు.
● నగరంలోని శ్రీ మాధవి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ దుగ్గి బాలసుబ్రమణ్యం షుగర్ వ్యాధి నిపుణులుగా సేవలందిస్తున్నారు.
● గీతా డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ సెంటర్‌లో డాక్టర్ జ్యోతిప్రియదర్శిని షుగర్ వ్యాధి నిపుణులుగా చికిత్స చేస్తున్నారు.
● కర్నూలు రోడ్డులో శ్రీ ఆయుష్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్ కిషోర్ కుమార్ హెయిర్‌ఫాల్, పక్షవాతం, కీళ్లవాతం, మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు.
● అంజయ్య రోడ్డులో ఉన్న ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్ సునీల్ కిషోర్ ప్లాస్టిక్ సర్జన్‌గా, షుగర్ గాయాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
● సుందరయ్య భవనం రోడ్డులోని గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఎముకలు, కీళ్ల వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎన్‌బీ హర్షవర్థన్ రెడ్డి కీళ్ల మార్పిడి వైద్యంలో పేరొందారు. నెమ్ము, ఊపిరితిత్తుల వ్యాధులకు డాక్టర్ వి.ప్రత్యూష రెడ్డి చికిత్స చేస్తున్నారు.
● లంబాడీ డొంకలో ఉన్న కేర్ దంత వైద్యశాలలో డాక్టర్ కె.వేణుగోపాల్, డాక్టర్ సీహెచ్ హిమశిల్ప చికిత్స చేస్తున్నారు.
● సత్యనారాయణపురంలో శ్రేష్ట హాస్పిటల్‌లో చిన్నపిల్లల వైద్య నిపుణులైన డాక్టర్ డేవిడ్ విలియమ్స్ మెదడువాపు వంటి వ్యాధులకు కూడా వైద్య సేవలందిస్తున్నారు.
● అంజయ్య రోడ్డులో రవి తల్లి పిల్లల హాస్పిటల్‌లో తల్లి బిడ్డలకు ఇద్దరికీ డాక్టర్ సి.నిరంజన్ రెడ్డి, డాక్టర్ శోభారెడ్డి పర్యవేక్షణలో ఒకేచోట మెరుగైన వైద్యం అందుతోంది.
● ఎస్పీ ఆఫీసుకు ఎదురుగా ఒంగోలు పిల్లల హాస్పిటల్‌లో డాక్టర్ మృదుల గునుకుల అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు.
ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిణి ఇంజినీరింగ్ కళాశాల కేవలం మహిళల కోసమే నిర్వహిస్తున్నారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీలతో పాటుగా ఎంబీఏ, ఎంసీఏలకు విద్యాబోధన చేస్తున్నట్లు శ్రీ హర్షిణి చైర్మన్ గోరంట్ల రవికుమార్, గోరంట్ల కవిత తెలిపారు.
● శ్రీ ప్రతిభ విద్యా సంస్థల్లో ఐఐటీ, జేఈఈ అకాడమీ, జూనియర్ కాలేజీ ఉన్నట్లు శ్రీ ప్రతిభ చైర్మన నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు.
● ఎపెక్స్ స్కూలులో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్నారు.
నగరంలోని దశరాజుపల్లిలో అన్నీ రకాల సౌకర్యాలతో, సదుపాయాలతో డైమండ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు వి.సుబ్బారెడ్డి, కె.హేమంత్ తెలిపారు.
● అలాగే అంబికా ఫ్యాషన్ మాల్, గుంటూరు రోడ్డులోని సితారా హ్యాండ్లూమ్స్ రకరకాల ఫ్యాషన్లలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నాయి.
● సోలార్ రూఫ్ టాప్ లో ఏఎంబీ నగర ప్రజల నమ్మకాన్ని పొందిందని ఎండీ మిరియాల సాయి భార్గవ్ తెలిపారు.
ఒంగోలు టౌన్:
రాజకీయ, సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలిచిన ఒంగోలు ఎంతోమంది సినిమా దర్శకులను, నటులను, రచయితలను అందించింది. మరెంతోమంది కవులకు పుట్టినిల్లుగా పేరొందింది. వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఒంగోలులో పుట్టి పెరిగారు. వైద్యరంగంలో కూడా ఒంగోలుకు ప్రత్యేక స్థానం వుంది. దాన్ని నేటి తరం వైద్యులు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అత్యుత్తమ ప్రతిభతో ఆధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా వ్యాధులు వస్తే జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యేవారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్, చైన్నెలకు పరుగులు పెట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సమయాల్లో ఆపద్భాందువుల్లా ఆదుకుంటున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా హైదరాబాద్, చైన్నెలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నగరంలోనే మంచి వైద్య చికిత్సలు చేసి ప్రాణాలను కాపాడుతున్నారు. సంతాన సాఫల్యం కోసం గతంలో విజయవాడ, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకునేవారు. నెలనెలా చికిత్స కోసం వెళ్లలేక ఇబ్బందులు పడేవారు. అసలు వైద్యం కంటే ప్రయాణ ఖర్చులే ఎక్కువయ్యేవి. కానీ ఇప్పుడు ఒకడుగు రైల్వే స్టేషన్ వైపు వేస్తే జాయ్ హాస్పిటల్ వస్తుంది. ఇటు కర్నూలు రోడ్డుకు వెళితే విశ్వాస్ మల్టీ హాస్పిటల్ కనిపిస్తుంది. పండరీపురం బైపాస్ ఎక్కితే ఫెర్టీ కేర్ వచ్చేస్తుంది. నగరంలో ఎటువైపు వెళ్లినా చాలు సంతాన సాఫల్య చికిత్స లభిస్తుంది. విద్యారంగంలో కూడా ఒంగోలు నగరం పేరు ప్రఖ్యాతలు పొందింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో రాష్ట్ర స్థాయి బోధన కలిగిన కళాశాలలు ఉన్నాయి. నేటి తరానికి అవసరమైన విద్యనందిస్తున్నాయి. ఆధునిక ఏఐని సైతం చక్కగా బోధించే ఉపాధ్యాయులున్నారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో పేరెన్నికగన్న బ్రాండ్‌లు ఒంగోలు ప్రజలకు అందుబాటు ధరల్లో దుస్తులను విక్రయిన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ రకాల వ్యాపారాలు, వ్యాపకాలు ఇప్పుడు ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యలో విప్లవం ...
ఫ్యాషన్ ప్రభంజనం..
అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో వైద్య చికిత్సలు అందిస్తున్న ఒంగోలు వైద్యులు
అందుబాటులోనే కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
విద్యారంగంలోనూ దూసుకొని పోతున్న జిల్లా కేంద్రం
ప్రసిద్ధి చెందిన కళాశాలలు..ప్రముఖులకు నెలవు