హోరాహోరీగాక్రికెట్ పోటీలు
మేదరమెట్ల: రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి కప్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా రెండో రోజైన శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చైన్నె జట్లు విజయం సాధించాయి. ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో స్పార్టన్ వారియర్స్ తిరుపతి –సౌత్‌జోన్ సీసీ చైన్నె జట్లు తలపడ్డాయి. స్పార్టన్ వారియర్స్ తిరుపతి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన త్‌జోన్ సీసీ చైన్నె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన స్పార్టన్ వారియర్స్ తిరుపతి జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్ ఎంఆర్‌సీసీ చైన్నె– ఓకేషనల్ సీసీ బెంగులూరు జట్ల మధ్య జరగ్గా బెంగుళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఎంఆర్‌సీసీ చైన్నె జట్టు 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు చివరి వరకు హోరాహోరీగా సాగాయి.
నేటి మ్యాచ్‌లు: ఆదివారం ఉదయం ఏసీసీ లెవెన్ విజయవాడ–సౌత్‌జోన్ సీసీ చైన్నె జట్ల మధ్య, మధ్యాహ్నం జీడీసీఏ లెవెన్ గుంటూరు– ఎంఆర్‌సీసీ చైన్నె జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చైన్నె జట్ల విజయం


