నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
మద్దిపాడు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేందుకు కృషి చేయాలని పాఠశాల డైరెక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత పెంచేందుకే వంద రోజుల కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు సామర్థ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ఆడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి


