అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు రజనీష్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు రజనీష్‌

Jan 9 2026 7:16 AM | Updated on Jan 9 2026 7:16 AM

అంతర్జాతీయ  అథ్లెటిక్స్‌కు రజనీష్‌

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు రజనీష్‌

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు రజనీష్‌

మార్కాపురం టౌన్‌: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో కమలా స్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్‌.రజనీష్‌ గోల్డ్‌ మెడల్‌ సాఽధించారు. ఏప్రిల్‌లో థాయిలాండ్‌లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు స్కూల్‌ కరస్పాండెంట్‌ పవన్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రజనీష్‌ 35+ వయసు కేటగిరీలో హైజంప్‌, 4–100 రిలే రన్నింగ్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని వివరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పి.శివశంకర్‌, స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ సింధూజ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ స్వరూప్‌ రంజన్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement