దుకాణాల తొలగింపులో ఉద్రిక్తత
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న దుకాణాల సముదాయాన్ని అధికారులు గురువారం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణాల తొలగింపులో అధికారుల తీరుపై ఆగ్రహించిన చిరు వ్యాపారులు స్థానిక నటరాజ్ సెంటర్లో నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిరువ్యాపారులను తరిమికొట్టారు. జేసీబీలతో దుకాణాల తొలగింపును వ్యాపారులు అడ్డుకోవడంతో ఏఎస్సై పోతురాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. దుకాణాలు తొలగించే క్రమంలో చిరువ్యాపారులకు, వైద్యశాల అధికారులకు నడుమ స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. వైద్యశాలలో నూతనంగా మార్చురీ గది, ప్రహరీ నిర్మించేందుకు దుకాణాలు అడ్డుగా ఉన్నాయని, అందుకే వాటిని తొలగించాలని అధికారులను కోరినట్లు సూపరింటెండెంట్ మహేశ్వరి తెలిపారు.
చిరువ్యాపారులను తరిమికొట్టిన
పోలీసులు
పెద్దదోర్నాల మండల కేంద్రంలో ఘటన
దుకాణాల తొలగింపులో ఉద్రిక్తత


