రైతులకు విరివిగా రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు పీడీసీసీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా సాంకేతిక కమిటీ సమావేశం గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2026 ఖరీఫ్ సీజన్‌కు గాను, 2026–27 రబీ సీజన్‌కు సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ దాని అనుబంధ రంగాల్లోని ఉత్పత్తులకు రుణాలు అందించాలన్నారు. వ్యవసాయ రుణాలు రైతులకు ఏ మేరకు ఇవ్వాల్లో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా, సూక్ష్మ సాగు విధానాన్ని ప్రోత్సహించేలా సహకార బ్యాంకులు రైతులకు అవసరమైన రుణాలను విరివిగా మంజూరు చేయాలని సూచించారు. అలాగే రైతులకు సరైన సమయంలో, సరైన మొత్తంలో రుణం అందేలా చూడాలని కలెక్టర్ బ్యాంకు అధికారులకు సూచించారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంకు సీఈఓ పిడివి శర్మ, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ జేడీలు ఎస్ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్, ప్రకృకృతి వ్యవసాయాధికారి వి.సుభాషిణి, పీడీసీసీ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ పి.రాజాబాబు


