అధైర్య పడకండి.. అండగా ఉంటా
దర్శి: అధైర్యపడొద్దు..అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక శివరాజనగర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ నాయకుడు కవలకుంట్ల లాజరు, అనారోగ్యంతో ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న లాజర్‌ను, అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త పోరుమామిళ్ల చెన్నయ్యను, భర్త, కుమారున్ని కోల్పోయిన బండారు సరళ, బాపనపల్లి పోచమ్మలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మల్లె రామకృష్ణ, బత్తుల వెంకటేశ్వర్లు, రైతువిభాగం అధ్యక్షుడు కరిపిరెడ్డి రమణారెడ్డి, దొంతా ఏడుకొండలు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ మల్లె వెంకటేశ్వర్లు, పోరుమామిళ్ల శ్రీను, ముప్పూరి కొండయ్య, సానుకొమ్ము చలపతి, కత్తి పెద్దపెంచలు, రాచర్ల వెంకటేశ్వర్లు, షేక్ కరీముల్లా, ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తన్నీరు పాపయ్య, తన్నీరు అంకమ్మ, ఉయ్యాల వెంకటాద్రి, షేక్ ఖాశీం, ఉమ్మడి లక్ష్మణ్, కాండ్రకుంట శ్రీనివాసులు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి


