శ్రీగంధం చెట్ల నరికివేత కేసులో ఐదుగురు అరెస్ట్
కంభం మండలం తురిమెళ్లకు చెందిన బెల్లంకొండ నాయుడు స్వగ్రామంలో 2.85 ఎకరాల పొలంలో అటవీ శాఖ అనుమతితో శ్రీగంధం చెట్లు సాగు చేస్తున్నాడు. 2025 సెప్టెంబర్‌లో రెండు పర్యాయాలు పొలంలోని 10 శ్రీగంధం చెట్లు నరికి ముక్కలుగా చేసుకుని విక్రయించాడు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి చెందిన మండ్ల నరసింహులు, మండ్ల వేణు, షేక్ ఫారుఖ్, భూపని రామయ్య, బేస్తవారిపేట మండలం జేబీకే పురానికి చెందిన భూపని శివ రెండు మోటారుసైకిళ్లపై నాయుడు పొలంలో శ్రీగంధం చెట్లు నరికేందుకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంటాడారు. తురిమెళ్ల బస్టాండ్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు రెండు బైకులు, గొడ్డలి, రంపం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.


