నాణ్యమైన దిగుబడులు సాధించాలి
● పొగాకు బోర్డు ఆర్‌ఎం
కందుకూరు: సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పొగాకు సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని పొగాకు బోర్డు ఆర్‌ఎం ఎస్ రామారావు అన్నారు. కనిగిరి రోడ్డులోని ఒకటో పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం మండలంలోని కోవూరు, నరిశెట్టివారిపాలెం, పందలపాడు గ్రామాలను సందర్శించి పొగాకు రైతులకు అవగాహన కల్పించారు. విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల అనేక అనర్ధాలు వస్తాయని, అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం ఉంటుందన్నారు. బోర్డు అధికారులు సూచించిన పురుగు మందులను మాత్రమే వాడాలన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా జీవామృతం, పచ్చిరొట్ట వంటి ఎరువుల వినియోగం వల్ల మంచి దిగుబడులు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి వీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో సోమవారం లారీ, బస్సు, స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, రవాణా వాహన డ్రైవర్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్ సుశీల ప్రారంభించారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, సౌజన్యంతో హెల్త్ చెకప్‌లను నిర్వహించినట్లు ఉప రవాణా కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు హెల్త్ చెకప్‌లు చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విజయ లక్ష్మి, డాక్టర్ రామాంజనేయులు, ఎల్ సురేంద్ర ప్రసాద్, మోటార్ వాహన తనిఖీ అధికారి, కే జయ ప్రకాష్, యు ధర్మేంద్ర, బీభాను ప్రకాష్, డీ జస్వంత్ సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు, పరిపాలన అధికారి ఎం శ్రీనివాసులరావు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్‌చార్జి డీపీఓగా ఒంగోలు జిల్లా డీపీఓ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మిదేవీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ బాల చెన్నయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: వీఆర్‌వోపై వీఆర్‌ఏ దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ సైదులు సోమవారం తెలిపారు. పట్టణంలోని 7వ సచివాలయం వీఆర్వో వాడల రామ కోటేశ్వరరావు పై దరిమడుగు వీఆర్‌ఏ కాశీం కారు తాళం విషయంలో దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో వీఆర్‌ఏపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పొన్నలూరు: మండలంలోని మాలపాడు కేజీబీవీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి సుభాషిణి తెలిపారు. విద్యాలయంలో అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అకౌంటెంట్ పోస్టుకు డిగ్రీ–బీకాం, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 11 లోగా ఒంగోలు సమగ్ర శిక్షణ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
నాణ్యమైన దిగుబడులు సాధించాలి


