ఏపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ను శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం పోరాట పంథాలో పయనిస్తూ హక్కులను కాపాడుకొని భావితరాలకు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవటం కోసం ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.అమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీనారాయణ, ఐఫియా కౌన్సిలర్ పీవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.


