జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
ఒంగోలు: జాతీయస్థాయి అండర్ 20 జూనియర్ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పుత్తూరు అంబరీష్(ఈపీ విభాగం), ఏకాంబరం వెంకట సాయి మహిత (సాబరే) విభాగంలో రాణించి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిద్దరిని రాష్ట్ర అసోసియేషన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 5 నుంచి 10 వరకు ఒడిషా రాష్ట్రం కటక్ పట్టణం జవహర్‌లాల్ ఇండోర్ స్టేడియంలో జరిగే 33వ జాతీయ జూనియర్ ఫెన్సింగ్ పోటీల్లో మన రాష్ట్రం తరఫున వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ కోటా సాయి మనోహర్‌లు అభినందించారు.


