చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి
మేదరమెట్ల:
జరుగుమల్లి(సింగరాయకొండ):
మండలంలోని కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి కొత్తపల్లి నిఖిల్ జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎల్ అనూరాధ తెలిపారు. ఇటీవల అండర్–14 రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్‌మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జరగనున్న జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు. ఈ సందర్భంగా నిఖిల్‌ను, వ్యాయామ ఉపాధ్యాయుడు నర్రా కోటేశ్వరరావులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
చీరాల రూరల్:
చీరాల వాడరేవు తీరంలో ఆదివారం సినిమా షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తీరంలో సందడి వాతావారణం నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సముద్రస్నానానికి తీరానికి తరలిరావడంతో షూటింగ్ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోయింది. ఈ సినిమా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకోనుందని డైరెక్టర్ భీంజి తెలిపారు. శ్రీసుధార క్రియేషన్స్ వారి మాస్టర్ కనిష్క సమర్పించే ఈ సినిమాలో అనంతనేని శ్రీనివాస్, మౌనిక శర్మ హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారని, వీరిరువురికి ఇదే మొదటి సినిమా అని చెప్పారు. సినిమాలో నటీనటులుగా సుహాసిని మణిరత్నం, వినోద్‌కుమార్, ఇంద్రజ, శుభలేక సుధాకర్, అన్నపూర్ణమ్మ, తదితరులు ఉన్నట్లు చెప్పారు. కొరియోగ్రఫీ సంతోష్, బాలకృష్ణ, ఫైట్స్ రాజు, ప్రొడ్యూసర్‌గా పి.నాగరాజు వ్యవహరించనున్నారని తెలిపారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఈ నెల 13 వరకు షూటింగ్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు.
చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి
చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి


