వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
దుండగులు చించివేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు
● బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకుల ఫిర్యాదు
నాగులుప్పలపాడు: మండలంలోని ఈదుమూడి గ్రామంలో నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో కట్టిన ఫ్లెక్సీలను బ్లేడుతో కోసివేసినట్లుగా చినిగిపోయి ఉన్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలు చించివేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమ్మూరి సుధాకర్, గ్రామాధ్యక్షుడు యడవల్లి మోహనరావు, మండల సెక్రటరీ మున్నంగి డేవిడ్‌రాజు, అక్కి సాంబయ్య, కొమ్మూరి అశోక్, కొమ్మూరి నాగేశ్వరరావు, మున్నంగి చంద్రశేఖర్, కొమ్మూర ఆదాం, మొండితోక రాజేంద్ర, లంబు సుబ్బయ్య తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత


