మత్తులో చిత్తు
కంభం టు గిద్దలూరు రహదారిపై రోడ్డు పక్కనే పడిపోయిన మందుబాబు
తప్ప తాగి రాచర్ల నుంచి అనుమలవీడు గ్రామానికి వెళ్లే రోడ్డుపై పడిపోయిన మందుబాబు
రాచర్ల బస్టాండ్ సెంటర్‌లోని టీ స్టాల్ వద్ద
రోడ్డు పక్కనే..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధికో మద్యం దుకాణం, అడుగుకో బెల్టుషాపు ఏర్పాటు చేసి ప్రజల ఒళ్లు, ఇళ్లను గుల్ల చేస్తోంది. బెల్టుషాపుల ద్వారా మద్యాన్ని వాడవాడలా ఏరులై పారిస్తోంది. చాలా మంది మువకులు మద్యం మత్తులో పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యం, సరసమైన ధరకే మద్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతను మత్తులో ముంచేందుకు నాశిరకం మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్కడబడితే అక్కడ తప్పతాగి పడిపోయిన మందుబాబులు దర్శనమిస్తున్నారు. మార్కాపురం జిల్లా రాచర్ల బస్టాండ్ సెంటర్‌లో 24 గంటలు మద్యం అమ్మకాలు నిర్వహిస్తుండటంతో యువకులు మద్యం తాగి రోడ్లపైకి వచ్చి మత్తు ఎక్కువై కిందపడి దొర్లుతుండటంతో.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
– రాచర్ల
మత్తులో చిత్తు
మత్తులో చిత్తు


