8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

పొన్నలూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని బాలిరెడ్డిపాలెంలో గ్రామ యూత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సానేపల్లి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్లు రూ.799 ఎంట్రీ ఫీజు చెల్లించి 7వ తేదీ లగోఆ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.30,116, రెండో బహుమతి రూ.15,116 అందజేస్తామన్నారు. వివరాలకు 9959442356, 8688201688 నంబర్లను సంప్రదించాలని కోరారు.

11 నుంచి మూడు జిల్లాలస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

సీఎస్‌పురం(పామూరు): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సీఎస్‌పురంలో ఈనెల 11వ తేదీ నుంచి కేఎస్‌ రాయల్‌, ఎస్‌వీ ప్రసాద్‌ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. టోర్నీలో విజేతలకు బహుమతులు వరుసగా మొదటి బహుమతి రూ.75 వేలు, ద్వితీయ రూ.40 వేలు, తృతీయ రూ.20 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 10వ తేదీ లోగా రూ.1000 చెల్లించి జట్టు పేరును నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9347142615, 9848084818 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మార్కాపురం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్‌టీయూ మార్కాపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపికై న ప్రసాద్‌, దేశానాయక్‌ తెలిపారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య తెలిపారు. అదే విధంగా ఆర్థిక కార్యదర్శిగా సీహెచ్‌ గాలెయ్య, గౌరవ అధ్యక్షునిగా రామదాసు, గౌరవ సలహాదారునిగా రాఘవరెడ్డి, అసోసియేషన్‌ అధ్యక్షునిగా యూసఫ్‌ షరీఫ్‌, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాదరావు, ఖాదర్‌ బాషాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, దస్తగిరి, జయశ్రీ, నబిఖాన్‌, శ్రీలత, సోఫియారాణి, వేణుగోపాల్‌, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement