45 ఏళ్ల తరువాత అపూర్వ కలయిక
మార్కాపురం: ‘అరేయ్ ఎలా ఉన్నావ్..రా నిన్ను చూసి ఎన్నేళ్లయింది. ఎంత మారిపోయావ్..పిల్లలంతా క్షేమమా’... ఓరేయ్ వెంకటేశ్వర్లు నువ్వంటరా.. అసలు గుర్తుపెట్టలేదురా’ అంటూ పలికరింపులు, ఆత్మీయ ఆలింగనాలతో నాటి మధుర స్మృతులను గురు్‌ుత్కతెచ్చుకున్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1979–90లో పదో తరగతి చదివిన విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చమత్కార సంభాషణలు, చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మనసారా నవ్వుకున్నారు. సుమారు 120 మంది చిన్ననాటి స్నేహితులంతా కలిసి తమ పాత జ్ఞాపకాలను, తీపి గుర్తులకు గుర్తుకు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ రిటైర్డు అయిన పూర్వ విద్యార్థులు ఎస్‌ఎల్ సుబ్బారావు, విల్సన్ ఐజక్, ఆకుల వెంకటేశ్వర్లు, కాటం వెంకటరమణ, గొంట్ల వెంకటేశ్వర్లు, షేక్ షబ్బీర్ తదితరులను మిత్రులు ఘనంగా సన్మానించారు. మిత్ర బృందం అధ్యక్షుడు సయ్యద్ సుభానీ, కార్యదర్శి జీవీ వర ప్రసాద్‌గుప్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ కదం శ్రీనివాసరావు, డీవి ప్రసాద్, ఎస్ లక్ష్మి సుబ్బారావు, నాగెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


