పొగాకు మాటున గంజాయి సాగు
అర్దవీడు: మండలంలోని మాగుటూరులో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొండారెడ్డి శనివారం తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన బి.తిరుపాలు తన పొగాకు పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడే గంజాయి మొక్కలు తొలగించి వాటిని దహనం చేశారు. అనంతరం తిరుపాలును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు.
ఒంగోలు టౌన్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 5వ తేదీ వీబీజీ రాంజీ చట్టం–2025పై అవగాహన కల్పించడానికి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి.జోసఫ్ కుమార్ తెలిపారు. శనివారం డ్వామా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కూలీలకు కల్పించే పనిదినాలు 100 నుంచి 125కు పెంచడం, పథకానికి కేంద్రం రాష్ట్ర నిధులు 60–40 నిష్పత్తిలో ఖర్చు చేయడం, వ్యవసాయ పనుల కాలంలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేయడం, డిమాండ్ ఆధారంగా కాకుండా ముందుగా కేటాయించిన నిధుల ప్రకారమే గ్రామాల్లో పనులు గుర్తించడం గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ఒంగోలు వన్‌టౌన్: చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు అని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి బిలియనీర్ ఎలా అయ్యాడని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన.. స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పరిపాలన సరిగ్గా లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు. గ్రామాల్లో టీడీపీ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తిరుమలలో స్వామివారి బంగారం రికార్డుల్లో ఎంత ఉంది, ఎక్కడ పెట్టారు.? అని అడిగితే టీటీడీ ఈవో నుంచి సమాధానం రావడం లేదన్నారు. పచ్చగా ఉన్న వందల ఎకరాల టీటీడీ భూములను కార్పొరేట్ సంస్థలకు పంచుతున్నారని మండిపడ్డారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు సరిగ్గా రావడం లేదన్నారు. యూనివర్శిటీలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులు కన్నీళ్లతో ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 30 శాతం మాత్రమే ఇస్తా మని, మిగిలిన 70 శాతం డబ్బు విద్యార్థులే భరించుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు విజయేంద్ర బహుజన్ పాల్గొన్నారు.
పొగాకు మాటున గంజాయి సాగు


