ఎకై ్సజ్ శాఖ విభజన
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎకై ్సజ్ శాఖను విభజించారు. నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో ఎకై ్సజ్‌శాఖ విభజనలో భాగంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని ఆరు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లను చేర్చారు. వీటి పరిధిలో 87 వైన్‌షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. విభజనతో 4 నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాలోకి వచ్చాయి. దీంతో మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, కంభం, పొదిలి ఎకై ్సజ్ స్టేషన్లు నూతన జిల్లాలోకి వచ్చాయి. వీటి పరిధిలో 84 వైన్‌షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. మార్కాపురం స్టేషన్ పరిధిలో 13, యర్రగొండపాలెం పరిధిలో 14, కనిగిరిలో 21, గిద్దలూరులో 13, కంభం 11, పొదిలి పరిధిలో 16 వైన్‌షాపులు ఉన్నాయి. బార్‌ల విభాగంలో మార్కాపురంలో 5, గిద్దలూరు, కనిగిరి, పొదిలిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. జిల్లా విభజనతో మార్కాపురం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఒంగోలు సూపరింటెండెంట్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ప్రకాశం జిల్లాలో నూతనంగా చేరిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని ఎకై ్సజ్ స్టేషన్‌లను కూడా ఒంగోలు పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని పోస్టులను విభజించాల్సి ఉంది. దీంతో పాటు నూతన జిల్లాలో మినిస్ట్రీరియల్ స్టాఫ్‌ను నియమించాల్సి ఉంది. నూతన జిల్లాలోకి బదిలీపై వచ్చేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంతమంది ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, పశ్చిమ ప్రకాశంలో ఊరూరా బెల్టుషాపులు, గంజాయి, నాటుసారా, గోవా లిక్కర్ ఉన్నాయి. ఇటీవలే దోర్నాల, యర్రగొండపాలెం, అర్దవీడు మండలాల్లో పలువురు గంజాయి సాగుచేయగా, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఇక వాస్కోడిగామా ట్రైన్‌లో గోవా రాష్ట్ర లిక్కర్ బాటిళ్లు జోరుగా మార్కాపురం వస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత నూతనంగా జిల్లాకు వచ్చే ఎకై ్సజ్ అధికారులపై ఉంది.
మార్కాపురం జిల్లాలో ఆరు ఎకై ్సజ్ స్టేషన్లు
ప్రకాశం జిల్లాలో చేరిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ఎకై ్సజ్ స్టేషన్లు ఒంగోలు పరిధిలోకి..


