మార్కాపురం డిపో అభివృద్ధికి చర్యలు
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న మార్కాపురం ఆర్టీసీ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జోన్ 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలోని జిల్లా ప్రజా రవాణా కార్యాలయాన్ని ఆర్‌ఎం సత్యనారాయణతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఒంగోలు వైపు వెళ్లే బస్సులకు ప్రత్యేక ప్లాట్‌ఫారాలు, అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. బస్టాండును ఆధునికీకరించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు పెంచుతామన్నారు. శ్రీశైలానికి ప్రస్తుతం 11 సర్వీసులు నడుపుతున్నామని, త్వరలో సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీ్త్రశక్తిలో భాగంగా 60 శాతం నుంచి 100 శాతానికి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. మార్కాపురం జిల్లాలోని మార్కాపురంతో పాటు కనిగిరి పొదిలి, గిద్దలూరు డిపోల్లో 300 బస్సులు ఉన్నాయని, వీటి సంఖ్య కూడా పెంచుతామని తెలిపారు. మార్కాపురం పట్టణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్టాండులో ప్లాట్‌ఫారాలు పెంచడంతో పాటు టాయిలెట్లు, ఇతరత్రా సౌకర్యాలు మెరుగుపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎం నరసింహులు, ఏడీయం ధనలక్ష్మి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈడీ నాగేంద్రప్రసాద్
ఇన్‌చార్జి ఆర్‌ఎంగా సత్యనారాయణ


