పీవీఆర్ పూర్వ విద్యార్థుల భారీ ర్యాలీ
● 10, 11 తేదీల్లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా..
ఒంగోలు సిటీ: నగరంలోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీవీఆర్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ గాంధీ రోడ్డు, దక్షిణం బజార్, పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా ఆర్పీ రోడ్డు, సాయిబాబా ఆలయం మీదుగా సాగింది. పీవీఆర్ పూర్వ విద్యార్థి, ప్రస్తుత వెంకట రమణ హాస్పిటల్ అధినేత డాక్టర్ సీతారామయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకించి మహిళా పూర్వ విద్యార్థులు పాల్గొని ఆకర్షణగా నిలిచారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరగబోయే పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలలో అందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు.


