సత్తా చాటిన ఈతముక్కల విద్యార్థినులు
కొత్తపట్నం: పాలిటెక్నిక్ జిల్లాస్థాయి బాలికల ఆటల పోటీల్లో ఈతముక్కల కాలేజీ విద్యార్థినులు సత్తా చాటారు. రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఏడు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన 220 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఈతముక్కల విద్యార్థులు వాలీబాల్, ఖోఖోలో విన్నర్లుగా నిలిచారు. ఖోఖో రన్నర్‌గా ఖమ్మం పాలిటెక్నిక్ విద్యార్థులు, వాలీబాల్ రన్నర్‌గా పేస్ కాలేజీ విద్యార్థులు గెలిపొందారు. షటిల్ సింగిల్ విన్నర్‌గా రైజ్ కాలేజీ, రన్నర్‌గా కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ గెలిపొందారు. షటిల్ డబుల్స్‌లో విన్నర్‌గా ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ, రన్నర్‌గా రైజ్ కాలేజీ విద్యార్థులు గెలుపొందారు. చెస్‌పోటీల్లో విన్నర్‌గా ఈతముక్కల కాలేజీ విద్యార్థులు, రన్నర్‌గా పేస్ కాలేజీ విద్యార్థినులు నిలిచారు. మొత్తం మీద ఓవరాల్ గేమ్స్, స్పోర్ట్స్ చాంపియన్‌గా ఈతముక్కల విద్యార్థునులు కై వసం చేసుకున్నారు. అనంతరం కాలేజీలో బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు బత్తుల జీవన్‌కుమార్, డీఎన్‌వీ రత్నబాబు, కాలేజీ ప్రిన్సిపాల్ వి.ఏసుప్రసాద్‌రావు పాల్గొన్నారు.
సత్తా చాటిన ఈతముక్కల విద్యార్థినులు


