
జీవితాలతో ఆటలు
పచ్చ బుకీలు..
హలో.. ఈరోజు సన్‌రైజర్స్– ముంబై ఇండియన్స్ మ్యాచ్.. విన్నింగ్ టీం బెట్టింగ్‌పై రూ. పదివేలు వేస్కో, ఫస్ట్ సిక్స్‌పై రూ. ఐదువేలు పెట్టేస్కో, తొలి ఐదు ఓవర్లలో యాభై పరుగులుగు రూ. మూడు వేలు అంటూ వందలాది ఫోన్లు మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచి ఫలానా టీం పక్షాన తన బెట్టింగింత.. అంటూ బుకీలు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రూ. వందతో మొదలైన ఈ వ్యవహారం.. ప్రస్తుతం పదివేలు, ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు పోయిందంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ బెట్టింగ్ మాఫియాలో కూరుకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆ మూడు మండలాలు అడ్డా..
కొండపి నియోజకవర్గం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు డెన్‌గా మారింది. కొండపి మండంలోని కట్టుబడివారి పాలెం గ్రామంలో అనేక మంది బుకీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండపాలెం పంచాయతీ గవదగట్లవారి పాలెం గ్రామానికి చెందిన ఒక బుకీ, అదే గ్రామానికి చెందిన మరో బుకీ, సింగరాయకొండలోని ఒక రెస్టారెంట్ యజమాని, సోమరాజుపల్లి పంచాయతీ ఫకీరుపాలెం గ్రామానికి చెందిన ఒక యువకుడు, మరో ఇద్దరు యువకులు బుకీలుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, రామచంద్రపురం, పంగులూరివారిపాలెం గ్రామాలకు చెందిన మరో ఇద్దరు కూడా జోరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే...
విద్యార్థులకు సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే బెట్టింగ్‌లకు పాల్పడుతుండడం విచారకరం. పశ్చిమ ప్రకాశంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు క్రికెట్ బెట్టింగ్‌లు బానిసలుగా మారినట్టు ప్రచారం జరుగుతుంది. యర్రగొండపాలెం, దోర్నాల, కంభం, కనిగిరి ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఈ భూతం పాలిట పడినట్టుగా తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో బెట్టింగ్ భూతం రెచ్చిపోతుంది. బెట్టింగ్‌లకు పాల్పడి రోడ్డున పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్‌లు ఇప్పుడు గ్రామస్థాయికి విస్తరించాయి. చేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ బెట్టింగ్‌లు అందుబాటులో వచ్చాయి. దీన్ని ఆసరాగా తీసుకుని బుకీలు బెట్టింగ్‌లు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసలై డబ్బులను పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చే మార్గం కానరాక దొంగలుగా మారుతున్నారు. మరికొందరు మాత్రం ఊరు విడిచి వెళ్లిపోతుండగా ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ మాఫియా రెచ్చిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలు నగరంలో ముంగుమూరు రోడ్డులో ఉండే కీలక బుకీకి, ఎన్జీఓ కాలనీలో ఉండే బుకీకి, సత్యనారాయణపురం ఏరియాలో ఉండే మరో బుకీకి అధికార టీడీపీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటూ జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లకు ఆన్‌లైన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపు పేరుతో...
మ్యాచ్ మొదలైందంట ఏచాలు సెల్‌ఫోన్లలోనే బెట్టింగ్‌లు షురూ చేస్తున్నారు. ఈ రోజు మ్యాచ్‌పై తన వాటా.. లేదా తమ నలుగురి బెట్టింగ్ ఇంతా అంటూ సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం.. మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆ గ్రూపంతా ఓ చోట కలుసుకుని డబ్బులను పంచుకోవడం గ్రామాల్లో పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఫ్రెండ్స్ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నగర శివారులోని ఐఎఫ్‌పీ గోడౌన్ ఎదురుగా ఒక టీడీపీ నాయకుడి ఇంటిని కేంద్రంగా చేసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే నిత్యం రద్దీగా ఉండే 60 అడుగు రోడ్డులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఒక లాడ్జీలో కూడా బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలిసింది. ఒక టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఇక్కడ బెట్టింగ్‌లతో పాటుగా పేకాట కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాంనగర్‌లో కూడా ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకొని బెట్టింగ్‌లు, పేకాట, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగులు ఒంగోలు కేంద్రంగా టీడీపీ నేతల అండతో రెచ్చిపోతున్న బుకీలు లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్లలో జోరుగా దందా బుకీలకు అడ్డాగా కొండపి, సింగరాయకొండ, జరుగుమిల్లి మండలాలు సింగరాయకొండ కేసులో పోలీసులకు భారీగా ముడుపులు బెట్టింగ్ భూతానికి బలవుతున్న అమాయకులు