కూల్చివేత రాజకీయ కక్ష సాధింపు చర్యే: అంబటి రాంబాబు | Ex Minister Ambati Rambabu Slams CM Chandrababu Over YSRCP Office Demolish | Sakshi
Sakshi News home page

కూల్చివేత రాజకీయ కక్ష సాధింపు చర్యే: అంబటి రాంబాబు

Jun 22 2024 12:04 PM | Updated on Jun 22 2024 4:15 PM

ysrcp ex minister ambati rambabu slams on cm chandrababu over ysrcp office demolish

తాడేపల్లి: తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శనివారం ఉదయం కూల్చివేత స్థలాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు.  

‘నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో  నేలమట్టం చేశారు.  ఇది వైఎస్సార్‌సీపీ ఆఫీసు నిర్మాణం కోసం నిర్మించాం. కేబినెట్‌ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నాం.  గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా పార్టీ ఆఫీసు కోసం స్థలం కేటాయించింది. కక్ష సాధింపుతో కూల్చివేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన పరిపాన చేస్తున్న చం‍ద్రబాబు మాటలేవి?. కక్షసాధింపుతో వైఎస్సార్‌సీపీ భవనాన్ని కూల్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు’ అని అంబటి అన్నారు.

కూల్చిన పార్టీ ఆఫీసు వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలు చేరుకున్నారు. సీతానగరం భవన ప్రాంతాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు.

అధికారం శాశ్వతం కాదు చట్టబద్ధంగా కూల్చి ఉంటే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement