ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా బిల్లును ఓడించామని కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారని, ఇది మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసపూరిత చర్య అని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీలే ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు.
రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సైనికులను రాహుల్ అవమానించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని, రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపుపై కేంద్ర క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ 7 సార్లు మహిళా బిల్లును అడ్డుకున్నారన్నారు కిషన్‌రెడ్డి.


