ఇక సహించే ప్రసక్తే లేదు: జనసేన ఎమ్మెల్యే | Tussle for supremacy between TDP and Janasena Avanigadda | Sakshi
Sakshi News home page

ఇక సహించే ప్రసక్తే లేదు: జనసేన ఎమ్మెల్యే

Oct 12 2026 5:52 PM | Updated on Oct 12 2026 6:20 PM

Tussle for supremacy between TDP and Janasena Avanigadda

ఆవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అక్కడ పరిస్థితి టీడీపీ వర్సెస్‌ జనసేన అన్న చందంగా మారిపోయింది. తాము తగ్గమంటే, తాము కూడా తగ్గమంటూ  ఇరు పార్టీల నేతలు ఇక్కడ బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. 

మా ఆత్మ గౌరవాన్ని మంటగలపాలని చూస్తే సహించం
టీడీపీ  మీటింగ్‌లు పెట్టి నన్ను తిట్టినా నేను పట్టించకోలేదు. కానీ ఇక పై జనసేన నేతలను నేను ఆపను. చంద్రబాబు చెప్పిన మాటను పాటించడానికే నేను పనిచేస్తున్నా. నేను శంకుస్తాపన చేసిన రోడ్డుకు టిడిపి నేతలు ఎలా మళ్లీ ఎలా శంకుస్థాన చేస్తారు. ఈ విషయం పై చంద్రబాబుకు ఆరోజే లేఖ రాశా. అవనిగడ్డ టిడిపి నేతల గురించి జిల్లా నాయకులకు తెలియదా. టిడిపి ముఖ్య నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. జిల్లా అధ్యక్యుడు కొనకళ్ల నారాయణ, పార్లమెంట్ పరిశీలకులు ,జిల్లా ఇంఛార్జి మంత్రి సుభాష్‌కు ఈ విషయాలేవీ తెలియవా?, లేకపోతే మీరు నియంత్రించలేకపోతున్నారా?,  మా ఆత్మ గౌరవాన్ని మంటగలపాలని చూస్తే సహించం. 

ఇక పై జనసేన కార్యకర్తలు మీ ఆత్మాభిమానానికి తగినట్లుగా మీరు వ్యవహరించండి. జనసేన కార్యకర్తలను శాశ్వత మిత్రులు చేసుకుంటారా?, శాశ్వత శత్రువులు చేసుకుంటారా టిడిపి నేతలు తేల్చుకోవాలి. ఏ ఆఫీస్‌లోనూ జనసేన వారికి పనులు జరగడం లేదు. టిడిపి వారితో పాటు జనసేన వాళ్లను కూడా గౌరవించాలని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు పై అపారమైన గౌరవం ఉంది. అవనిగడ్డలో కూటమి భగ్నం కావడానికి కారణం నియోజకవర్గ పరిశీలకుడు. అవనిగడ్డలో ప్రతీ చెడ్డపనికి లోకేష్ పేరు వాడుతున్నారు. 

పేకాటలో పట్టుబడ్డా, రేషన్ బియ్యం పట్టుకున్నా లోకేష్ పేరు వాడుతున్నారు. ప్రభుత్వ ప్రతిష్ట కాపాడాలనే నా ప్రయత్నం. నేను నాలుగు రోజులు కళ్లు మూసుకుని ఎక్కడికైనా వెళితే అవనిగడ్డలో అరాచకం జరుగుతుంది. అప్పుడు అప్రతిష్ట పాలయ్యేది ప్రభుత్వమే. ప్రభుత్వ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాంటిడిపి పరిశీలకుడు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. పేకాట ఆడుకున్నా పట్టుకోవద్దంటే చెప్పండి వదిలేద్దాం. మీ పేరు వాడుతున్న వారి పై 
లోకేష్ ఇప్పటికైనా విచారణ జరిపించాలి. టిడిపి ఎమ్మెల్యేలున్న చోట జనసేన వాళ్లకు ఏ ప్రాధాన్యత ఇచ్చారో ఇక్కడ కూడా మేం టిడిపికి అంతే ప్రాధాన్యత ఇస్తాం.ఇక పై టీడీపీతో నిర్వహించిన ఏ సమావేశానికి నేను హాజరవ్వను’ అని తెలిపారు.

ఇన్నాళ్లూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం
బుద్ధప్రసాద్ కుమారుడు,మండలి వెంకట్ రామ్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని, ఇక పై జనసేన గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. జనసేనను చిన్న పార్టీగా చూస్తున్నారని, ఇక పై మీరు ఒకటి మాట్లాడితే మేం వంద మాట్లాడతామని హెచ్చరించారు. అవనిగడ్డలో ఏం జరుగుతుందో అధిష్టానం కూడా గమనించాలన్నారు.

ఇదీ చదవండి: ‘అమరావతి నుంచి చెత్త వరకూ అంతా దోపిడీనే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement