టీఆర్‌ఎస్‌ నుంచి మురళీయాదవ్‌ సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్మన్‌ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్‌

Published Sun, Aug 7 2022 9:36 AM

TRS Suspended Murali Yadav From Party - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి, ఆయనకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు.
చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?

Advertisement
 
Advertisement
 
Advertisement