టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి | Tdp False Allegations On Furniture In Ys Jagan Camp Office | Sakshi
Sakshi News home page

టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి

Published Sat, Jun 15 2024 6:45 PM | Last Updated on Sat, Jun 15 2024 9:32 PM

Tdp False Allegations On Furniture In Ys Jagan Camp Office

సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్‌ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.

‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్‌ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement