ఏలూరు: లోకేష్‌ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు | TDP Activists Attacked YSRCP Workers In Tukkuluru - Sakshi
Sakshi News home page

ఏలూరు: లోకేష్‌ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు

Aug 25 2023 2:45 PM | Updated on Aug 25 2023 3:44 PM

Tdp Activists Attacked Ysrcp Workers In Tukkuluru - Sakshi

సాక్షి, ఏలూరు: లోకేష్‌ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్‌సీపీ నేత విజయ్‌ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్‌ యువగళం టీమ్‌ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్‌ కానిస్టేబుల్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.
చదవండి: ఆర్జీవీ థర్డ్‌ గ్రేడ్‌ అంటూ లోకేశ్‌ వ్యాఖ్యలు.. రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన వర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement