శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా..

Sasikala Discharged From Victoria Hospital In Bangalore - Sakshi

ఆస్పత్రి నుంచి శశికళ డిశ్చార్జ్

సాక్షి, బెంగుళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి విధితమే. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు.
(చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది)

కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.(చదవండి: మోదీ మన్‌ కీ బాత్‌: ఆ ఘటన బాధాకరం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top