Evening Top 10 Telugu News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Sakshi Telugu Breaking News Latest Telugu News 24th August 2022

1. YSR Kadapa: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌
సెప్టెంబర్‌ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. స్పీకర్‌కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్‌పై సంచలన కామెంట్స్‌
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్‌ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ కింద నోటిస్‌ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్‌ ఇచ్చారని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Dellhi Liquor Scam: సిటీ సివిల్‌ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..
సిటీ సివిల్‌ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సిటీ సివిల్‌ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. బల పరీక్షలో నెగ్గిన నితీష్‌ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్‌
బిహార్‌ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఏకగ్రీవంగా నెగ్గింది. ఈ సందర్భంగా అసెం‍బ్లీలో సీఎం నితీష్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ట్రంప్ రికార్డు బ్రేక్ చేసిన బైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు చోటు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘లైగర్‌’ ఫస్ట్‌ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..
విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ కోసం ‘రౌడీ’ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేపే(ఆగస్ట్‌ 25) ఈ చిత్రం విడుదల కోబోతుంది. దీంతో విజయ్‌ అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. విడుదల కానున్న ఐఫోన్‌14 సిరీస్‌, భారతీయులు ఏమంటున్నారంటే!
టెక్‌ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ -14 సిరీస్‌ సెప్టెంబర్‌ 7న లాంచ్‌ కానుంది. కొత్త ఐఫోన్‌ సిరీస్‌ విడుదలతో యూజర్లు తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్‌.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎందురు చూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. దాయాదుల పోరుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ‍ప్రయోజనాలు!
కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top