Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Sakshi Breaking News Trending News Morning News Roundup 5th August 2022

1. టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం'
పేరు మార్పు కేసీఆర్‌ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. 
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. డీజిల్‌ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్‌! తొలుత హైదరాబాద్‌లో ఆటోలకు బ్యాటరీల బిగింపు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్‌ వాహనలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్‌ రెడ్‌కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.  
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గుడ్‌న్యూస్‌: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’
వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే..
టీమిండియా టి20 ప్రపంచకప్‌ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్‌ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్‌ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. 
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Godfather Twitter Review ‘గాడ్‌ ఫాదర్‌’ టాక్‌ ఎలా ఉందంటే..
మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్‌ చేశారు. తెలుగు వెర్షన్‌ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అందుబాటులోకి 5జీ, భారత్‌లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు
భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్‌సెట్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో అమోన్‌ తెలిపారు. 
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Dussehra 2022: పాలయమాం దేవీ!
ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి...
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఏదైనా స్పెషల్‌ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి.. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా!
విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్‌ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు.
👉 : పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top