Godfather Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Godfather Twitter Review ‘గాడ్‌ ఫాదర్‌’ టాక్‌ ఎలా ఉందంటే..

Oct 5 2022 7:14 AM | Updated on Oct 5 2022 10:40 AM

Godfather Movie Twitter Review In Telugu - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్‌ చేశారు. తెలుగు వెర్షన్‌ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో డబ్‌ అయి, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాను మెగాస్టార్‌ మళ్లీ రీమేక్‌ చేయడంతో ‘గాడ్‌ ఫాదర్‌’పై అందరికి ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. దానికితోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాలు మధ్య నేడు(ఆక్టోబర్‌ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. 



‘గాడ్‌ ఫాదర్‌’తో చిరంజీవి మళ్లీ సూపర్‌ హిట్‌ కొట్టాడని నెటిజన్స్‌ అంటున్నారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’అని ట్వీట్స్‌ చేస్తున్నారు. తమన్‌ నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెబుతున్నారు. మాతృకలో ఉన్న మెయిన్ పాయింట్‌ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలో భారీ మార్పులే చేశారని చెబుతున్నారు.ఇక మరికొంతమంది అయితే గాడ్‌ ఫాదర్‌ యావరేజ్‌ సినిమా అంటున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement