ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. మోదీకి కేజ్రీవాల్‌ కౌంటర్.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని ట్వీట్‌

Sad When Indian Politicians Call Free Education Revdi  Arvind Kejriwal - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు.

అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్‌ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు.

డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది.   

ఇటీవల మధ్యప్రదేశ్‌లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు.  ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇ‍చ్చారు.
చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top