‘బీజేపీ తదుపరి టార్గెట్‌ తెలంగాణ’ | Ramchander Rao on BJP National Presidents Telangana Tour | Sakshi
Sakshi News home page

‘బీజేపీ తదుపరి టార్గెట్‌ తెలంగాణ’

Jun 27 2026 3:39 PM | Updated on Jun 27 2026 3:46 PM

Ramchander Rao on BJP National Presidents Telangana Tour

హైదరాబాద్‌:  బీజేపీ తదుపరి టార్గెట్‌ తెలంగాణలో విజయ ఢంకా మోగించడమేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచే తెలంగాణలో విజయానికి నాంది పలుకుతామన్నారాయన. వచ్చే కార్పోరేషన్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి బీజేపీ సత్తా చూపెడతామన్నారు.  బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం మూడు పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు(ఆదివారం) హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ వస్తున్నారని రాంచందర్‌ రావు తెలిపారు.

తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుంది
వరంగల్ : తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌,. పశ్చిమ బెంగాల్‌లో గెలిచి మొదటి మాసంలో చెప్పిన మాటలను నిలబెట్టుకున్నామన్నారు. 29వ తేదీన నితిన్‌ నబీన్‌ వరంగల్‌లో పర్యటించనున్నారని, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బూత్‌ లెవెల్‌ కార్యకర్తల సదస్సులో నితిన్‌ నబీన్‌ పాల్గొంటారని లక్ష్మణ్‌ తెలిపారు.  

జాతీయ అధ్యక్షుడి పర్యటనలో అన్ని వర్గాలను కలుస్తారని, గిరిజన నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఆస్తులను వేలం వేసి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీని కాదని కాంగ్రెస్‌ని గెలిపిస్తే.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్టడ్లు అయ్యిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి, ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement