మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Says Modi Government Harmful For Employment Never Support Business - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు దేశంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆగష్టులో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్‌ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం స్పందించారు. ‘‘మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం. ఈ ప్రభుత్వం స్నేహితులు కాని వారి వ్యాపారాన్ని, ఉపాధిని ప్రోత్సహించదు. దానికి బదులుగా వ్యాపారాలు కలిగి ఉన్న వారి నుంచి ఉద్యోగాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని రాహుల్‌ విమర్షించారు.  స్వతంత్ర థింక్ ట్యాంక్ వివరాల ప్రకారం.. జులైలో 6.96 శాతం ఉన్న జాతీయ నిరుద్యోగం గత నెలలో 8.32 శాతానికి పెరిగిందన్నారు . ఆగస్టులో పట్టణ నిరుద్యోగం 9.78 శాతంగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందు మార్చిలో 7.2 శాతం ఉండగా.. జూలైలో 8.3 శాతం పెరిగిందన్నారు.

చదవండి: భూములు, డబ్బులపై అత్యాశ, ఆసక్తి లేవు

దేశవ్యాప్తంగా కనీసం ఎనిమిది రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా,రాజస్థాన్ ఇప్పటికీ రెండంకెల నిరుద్యోగ రేట్లను నివేదిస్తున్నాయి. హర్యానా నిరుద్యోగిత రేటు అత్యధికంగా 35.7 శాతంగా ఉంది. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి విఫలమైందని దుయ్య బట్టారు. పైగా "ఆర్థిక నిర్మాణాన్ని నాశనం చేసే" విధానాలను రూపొందించి, కోట్ల మందిని నిరుద్యోగులుగా మార్చారని ఆరోపించారు. నరేంద్ర మోదీ విధానాల ద్వారా 14 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.

చదవండి: హుజురాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top