రాహుల్‌, ప్రియాంకతో భేటీ: సిద్ధూకు కొత్త బాధ్యతలు!

Punjab Congress: Navjot Singh Sidhu Meets Rahul Gandhi, Priyanka Gandhi - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నాయకుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. ‘ప్రియాంక గాంధీజీతో సుదీర్ఘ సమావేశం జరిగింది’అంటూ ట్విట్టర్‌లో సిద్ధూ వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధ బహిరంగంగానే తన అసమ్మతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పార్టీలో తన పాత్ర గురించి సిద్ధూ ప్రియాంకతో చర్చించినట్టుగా తెలుస్తోంది. సిద్ధకి త్వరలో కొత్త బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సిద్ధూతో సమావేశమయ్యే అవకాశమే లేదని రాహుల్‌ మంగళవారం చెప్పారు. మరుసటి రోజే ప్రియాంక, రాహుల్‌లు సిద్ధూకి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం విశేషం.

చదవండి: ‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్‌ గాంధీ!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top