breaking news
Punjab Congress
-
‘చన్నీ సాహెబ్ గెలిచారు!’.. ముందుంది ముసళ్ల పండుగ
పంజాబ్ కాంగ్రెస్‌లో చాలాకాలంగా సాగుతున్న అంతర్గత పోరు మరో కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మాజీ భారత హాకీ కెప్టెన్, జలంధర్ కాంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అయితే ఈ మార్పు కంటే.. పదవి నుంచి తప్పుకున్న తర్వాత వారింగ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పంజాబ్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా రాజా వారింగ్ వర్గానికి, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో పీసీసీ అధ్యక్షుడైన వారింగ్.. రాష్ట్రంలో పార్టీని నడిపిస్తూ వచ్చారు. అయితే చన్నీ వర్గం మాత్రం నాయకత్వ మార్పు కోరుతూ వచ్చింది. ఈ అంతర్గత పోరు క్రమంగా బహిరంగ చర్చగా మారింది.ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సెప్టెంబర్‌లో పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా భూపేశ్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను నియమించింది. పైలట్ సమక్షంలో సెప్టెంబర్ 15న జరిగిన పార్టీ కార్యక్రమంలో వారింగ్, చన్నీ ఒకే వేదికపై కనిపించి చేతులు కలపడంతో విభేదాలు తగ్గినట్టుగా కనిపించినా.. అధ్యక్ష పదవిపై అసలు పంచాయితీ మాత్రం కొనసాగింది.‘నన్నెవరూ రాజీనామా అడగలేదు’“చన్నీ సాహెబ్ గెలిచారు”.. వారింగ్ వ్యాఖ్యల్లో ఇదే అసలు సంచలనం ఇదే. తన రాజీనామా, తదుపరి జరిగిన అధ్యక్షుడి ఎన్నికపై వారింగ్ స్పందిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. అంటే.. తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చాలాకాలంగా కోరుతున్న చన్నీ వర్గం కోరుకున్న మార్పు చివరకు జరిగిందన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 30న వారింగ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తనను ఎవరూ నేరుగా రాజీనామా చేయాలని అడగలేదని వారింగ్ చెప్పారు. పరిస్థితి ఒక దశకు చేరుకుందని భావించి తానే పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. అయితే అదే సమయంలో పార్టీ ఇన్చార్జ్ సచిన్ పైలట్ తనను తప్పించాలని కోరుకున్నారని తనకు తెలిసిందని చెప్పారు.వారింగ్ స్థానంలో పర్గత్ సింగ్ ఎందుకు?వారింగ్ స్థానంలో పర్గత్ సింగ్‌ను ఎంపిక చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పర్గత్ సింగ్ మాజీ భారత హాకీ కెప్టెన్, ఒలింపియన్. 2012 నుంచి జలంధర్ కాంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అందుకే పర్గత్ నియామకాన్ని వారింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గానికి అనుకూల పరిణామంగా కొందరు చూస్తున్నారు. అయితే ఆయనకు సొంత రాజకీయ అనుభవం కూడా ఉంది. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ముందున్న ప్రధాన సవాలు.. పార్టీలోని వివిధ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడం.చన్నీ పరిస్థితి ఏంటి?చన్నీ పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు. జూలైలో ఆయనకు పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వారింగ్ అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం చన్నీ వర్గంలో అసంతృప్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు వారింగ్ వెళ్లిపోవడం, ఆయన స్థానంలో పర్గత్ సింగ్ రావడంతో చన్నీ ప్రభావంపై చర్చ మళ్లీ మొదలైంది. కొత్త అధ్యక్షుడి నియామకాన్ని చన్నీ స్వాగతించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ సహా అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పైలట్ పాత్రపై ఎందుకింత చర్చ?పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా సచిన్ పైలట్ నియమితులై కొన్ని వారాలే అవుతోంది. ఆయన రాక తర్వాతే అధ్యక్షుడి మార్పు జరగడంతో వారింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక పార్టీ సీనియర్ నేత సుఖ్జిందర్ సింగ్ రంధావా.. వారింగ్, తాను సహా పలువురు నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణమయ్యామని వ్యాఖ్యానించారు. ముందుంది మహా సంగ్రామంపంజాబ్లో 2027 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సంస్థాగత వ్యవస్థను ఎన్నికలకు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికలను సామూహిక నాయకత్వంతో ఎదుర్కొంటామని, ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమని సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు పర్గత్ సింగ్ బాధ్యతలు చేపట్టడంతో వారింగ్, చన్నీ వర్గాలతో పాటు ఇతర నేతలను కూడా సమన్వయం చేసుకుని పార్టీని ఎన్నికల దిశగా నడిపించడం ఆయన ముందున్న పని.మొత్తానికి.. వారింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఒక అధ్యాయం ముగిసింది. పర్గత్ సింగ్ నియామకంతో మరో అధ్యాయం మొదలైంది. “చన్నీ సాహెబ్ గెలిచారు” అన్న వారింగ్ వ్యాఖ్య ఇప్పుడు చర్చగా మారినా.. అసలు ఫలితం తేలేది మాత్రం ముందున్న రాజకీయ పరీక్షలోనే. వర్గ విభేదాలను పక్కనపెట్టి నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం పర్గత్ సింగ్‌కు ఇప్పుడు కీలక సవాలు.ఇదీ చదవండి: మోదీకి వచ్చిన కానుకలు మీ సొంతం చేసుకునే చాన్స్! -
పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి
పటియాలా: పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు మళ్లీ రాజుకుంటున్నాయి. శనివారం పటియాలాలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర చీఫ్ రాజా వారింగ్ ప్రసంగిస్తుండగానే మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి భూపేశ్ బఘేల్ వారించినప్పటికీ చన్నీ అనుకుల నినాదాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ పరిణామంపై భూపేశ్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే సీఎం, మంత్రులెవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బఘెల్ స్పష్టం చేశారు. ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి బయటకు వెళ్లే తలుపులు తెరిచే ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. గతంలో నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధూను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర చీఫ్ రాజా వారింగ్ ప్రసంగం మొదలవ్వగానే చన్నీ మద్దతుదారులు ‘చరణ్‌జీత్ సింగ్ చన్నీ జిందాబాద్, చన్నీకి పగ్గాలివ్వాలి–కాంగ్రెస్‌ను కాపాడాలి’అంటూ నినాదాలు చేశారు. దీంతో, వారింగ్ ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ పాటించాలని, సమావేశాన్ని కొనసాగనివ్వాలని కార్యకర్తలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇతర నేతలు సైతం కార్యకర్తలను వారించేందుకు ప్రయతి్నంచారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు భూపేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయి నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఫతేగఢ్ సాహిబ్, మొహాలీల్లో ‘హర్ బూత్, కాంగ్రెస్ మజ్బూత్’కార్యక్రమాలు చేపట్టి, కార్యకర్తలను ఐక్యంగా పనిచేయాలని కోరుతున్నారు. పంజాబ్‌లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. శనివారం పటియాలాలో పార్టీ సమావేశం అనంతరం బఘెల్ మీడియాతో మాట్లాడారు. చన్నీపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు..మాజీ సీఎం ఏం తప్పు చేశారని చర్యలు తీసుకోవాలంటూ ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. శక్రవారం ఫతేగఢ్ సాహిబ్‌లో బఘెల్ మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర విభాగంలో ఎటువంటి గ్రూపులు లేవంటూ చెప్పుకొచ్చారు. మీడియా, కొందరు వ్యక్తులు కలిసి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వారింగ్‌ను రాష్ట్ర పార్టీ చీఫ్‌గా తిరిగి నియమిస్తూ అధిష్టానం ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి. -
మ్యాగజైన్ స్టోరీ 29 September 2021
-
Navjot Singh Sidhu: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది
చండీగఢ్: తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని పంజాబ్ కాంగ్రెస్ నూతన చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం సిద్ధూ చండీగఢ్ చేరుకుని పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, రాహుల్, ప్రియాంకలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రయాణం మొదలైంది. విధేయత కలిగిన కార్యకర్తగా ‘జీతేగా పంజాబ్’మిషన్ సాకారానికి పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తా. పంజాబ్ మోడల్, అధిష్టానం సూచించిన 18 అంశాల ఎజెండాతో ప్రజల అధికారాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పాటియాలాలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుని మొహాలీలోని ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ నగ్రా నివాసానికి వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాకఢ్, మంత్రులు రజియా సుల్తానా, తృప్త్ రజీందర్ సింగ్, మాజీ సీఎం రజీందర్ కౌర్ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ శ్రేణులు, సిద్దూ మద్దతుదారులు స్వీట్లు పంచుకున్నారు. ఇలా ఉండగా, సీఎం అమరీందర్ తీవ్ర వ్యతిరేకత నడుమ సిద్ధూను పీసీపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ క్షమాపణ చెప్పే వరకు అతనితో సమావేశమయ్యేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సిద్దూ నియామకంపై ఆయన వర్గం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం సీఎం అమరీందర్ తన అధికార నివాసంలో పార్టీ నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
రాహుల్, ప్రియాంకతో భేటీ: సిద్ధూకు కొత్త బాధ్యతలు!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ‘ప్రియాంక గాంధీజీతో సుదీర్ఘ సమావేశం జరిగింది’అంటూ ట్విట్టర్లో సిద్ధూ వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధ బహిరంగంగానే తన అసమ్మతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పార్టీలో తన పాత్ర గురించి సిద్ధూ ప్రియాంకతో చర్చించినట్టుగా తెలుస్తోంది. సిద్ధకి త్వరలో కొత్త బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సిద్ధూతో సమావేశమయ్యే అవకాశమే లేదని రాహుల్ మంగళవారం చెప్పారు. మరుసటి రోజే ప్రియాంక, రాహుల్‌లు సిద్ధూకి అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం. చదవండి: ‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ! -
ఎంట్రీ టాక్స్ సబబే!
తేల్చిచెప్పిన రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ: రాష్ట్రాలు విధించే ఎంట్రీ టాక్సులో తప్పేమీలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పన్ను వసూలు చట్టాలను రూపొందించుకోవటం ఆయా రాష్ట్రాల హక్కు అని శుక్రవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బెంచ్ దీనిపై చర్చించింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూలు చేసే హక్కుందని 7-2 మెజారిటీతో ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్ను, సొంత రాష్ట్రంలో తయారీ పన్ను ఒకేలా ఉండేలా.. అవసరాలకు అనుగుణంగా ఆర్థిక నిబంధనలు మార్చుకోవటం రాష్ట్రాల హక్కు. ఈ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్రాలు రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్‌ను అతిక్రమించినట్లు కాదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఏ బాబ్దే, జస్టిస్ శివ కీర్తిసింగ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతిలు ఏకీభవించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఎంట్రీ టాక్స్ విధించే చట్టాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు. ‘పన్నులకు సంబంధించిన ఏ చట్టమైనా రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్ పరిధిలో ఉండాలి. ఇలాంటి చట్టం వివక్షరహితంగా ఉందని మెజారిటీ సభ్యులు భావిస్తే.. దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు’ అని 911 పేజీల తీర్పులలో సుప్రీం పేర్కొంది. ‘పక్కరాష్ట్రంలో ఉత్పత్తి అరుున వస్తువుకు భారీగా పన్ను విధించటం ద్వారా సొంతరాష్ట్రంలో దీని ధర పెరుగుతుంది. కానీ ఇలా పన్ను విధించటాన్ని రాజ్యాంగ విరుద్ధంగా భావించలేం’ అని బెంచ్ పేర్కొంది. ఈ సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయంది. ఆర్టికల్ 301 ప్రకారం వివక్షలేని పన్ను విధానంపై రాజ్యాంగ నియంత్రణ ఉంచకూడదని.. స్వేచ్ఛావాణిజ్య హక్కును కల్పించాలని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్టికల్ 301 ప్రకారం వస్తువులు, సేవలు, వ్యక్తులు, వాణిజ్యం, వ్యాపారం, లావాలదేవీల మూలధనం విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 42 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చండీగఢ్: సట్లేజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్‌వైఎల్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా గురువారం పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా.. శుక్రవారం 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చండీగఢ్ రోడ్లపై పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష హాల్లో సమావేశమై.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు సమర్పించారు. అరుుతే వీరి రాజీనామాలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు ఈ వివాదాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది.


