ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం | Professor Kodandaram Will Contest In MLC Elections | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమసారథికి మద్దతివ్వండి

Published Sat, Sep 19 2020 8:57 AM | Last Updated on Sat, Sep 19 2020 11:09 AM

Professor Kodandaram Will Contest In MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో త్వరలో జరుగునున్న పట్టభద్రల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు, ప్రోఫెసర్‌ కోదండరాం పోటీచేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండ రామ్‌కు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ప్రతిపక్ష పార్టీలను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్‌ లేఖలు పంపింది. కోదండరామ్‌ గెలుపు అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌రెడ్డి కోరారు.  మరోవైపు రెండు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ సైతం ఎంతో ప్రతిష్టాత్మకం‍గా భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement