టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరిన పొన్నం ప్రభాకర్ | Ponnam Prabhakar Comments Over Dubbaka By Elections | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో ఏ గ్రామనికైనా వెళ్దాం.. ఏ ఇల్లు ఉన్నాయో చుద్దాం

Oct 9 2020 2:03 PM | Updated on Oct 9 2020 2:04 PM

Ponnam Prabhakar Comments Over Dubbaka By Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే కాంగ్రెస్‌ను చూసి హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. హరీష్‌రావు లాంటి అబద్ధాల కోరును నమ్మనుకుంటే మునిగిపోతారని హితవు పలికారు. గతంలో హరీష్‌రావు ప్రచారం చేసిన ఉప ఎన్నికల నియోజక వర్గాలను పరిశీలిస్తే తన గురించి తెలుస్తుందని సూచించారు. చదవండి: దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

‘దుబ్బాకకు కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారు. సిద్ధిపేట పైన ఉన్న ప్రేమ దుబ్బాక పైన ఎందుకు లేదు. దుబ్బాకలో ఏ గ్రామనికైనా వెళ్దాం. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నాయా చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న గ్రామాలకు మీరు రావొద్దు, డబల్ బెడ్ రూమ్ ఉన్న గ్రామాలకు మేము రాము. దుబ్బాకలో టిఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రభావం దుబ్బాకలో లేదు’. అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. చదవండి:  ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా?

Advertisement
 
Advertisement
Advertisement