
సాక్షి,హైదరాబాద్: పోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో ‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నానని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమం.
తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే లీగల్‌గా పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సిట్ అధికారులను డిక్టేట్ చేయను. నాఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా.
ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తా. ట్యాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు. రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా...స్థానిక ఎన్నికలు ఆగవు.ఈ విషయంలో మా రాజకీయ వ్యూహం మాకుంది’ అని తెలిపారు.