
ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప
పుంగనూరు (చిత్తూరు): జనసేన శ్రేణులు ఎవరిని సీఎంను చేసేందుకు ఆరాటపడుతున్నారు? పవన్‌నా లేక చంద్రబాబునా? లేదా అసలు బాబుకు బంట్రోతుగా పవన్ ఊడిగం చేస్తారా? అనేది చెప్పాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక యుఎన్‌ఆర్ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్పతో కలిసి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఎల్లో మీడియా, ప్రతిపక్ష నాయకులు కలిసి చంద్రబాబును సీఎంను చేసేందుకు ఆరాటపడుతున్నారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జనసేన ప్రవర్తిస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒంటరి పోరాటం చేశారని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.