కారులో కలకలం.. ఈటల వెన్నంటే ఏనుగు రవీందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కారులో కలకలం.. ఈటల వెన్నంటే ఏనుగు రవీందర్‌రెడ్డి

Published Mon, May 31 2021 11:00 AM

Nizamabad: Enugu Ravinder Reddy Went Delhi With Etela Rajender - Sakshi

సాక్షి, కామారెడ్డి : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెన్నంటి ఉంటున్న రవీందర్‌రెడ్డి.. ఆయనతోపాటే ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన కారు దిగి కమలం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్‌రెడ్డి బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2004, 2009, 2010, 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో మాత్రం గెలుపు తీరాలకు చేరలేకపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన జాజాల సురేందర్‌ చే తిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత పరిణామాలతో సురేందర్‌ గులా బీ కండువా కప్పుకున్నారు. దీంతో క్రమంగా పార్టీలో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఎన్నికలలో ఓటమి పాలైనా తనకు అధిష్టానం న్యాయం చేస్తుందని ఆశించినా నిరాశే ఎదురైంది.  

అనుచరులతో నిత్యం చర్చలు.. 
తెలంగాణ ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన ఈటలను ప్రభుత్వం మంత్రి పదవినుంచి తొ లగించడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పటినుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల వెంటే ఉంటున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్ర జాసంఘాల నేతలతో చర్చల సందర్భంగా రవీందర్‌రెడ్డి కూడా ఆయన వెన్నంటే ఉన్నా రు. నియోజక వర్గానికి చెందిన తన అనుచరులతో నిత్యం చర్చించగా  చాలా మంది బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.  
చదవండి: Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే 

Advertisement

తప్పక చదవండి

Advertisement