వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

Published Wed, Feb 14 2024 10:37 AM

Mp Adala Prabhakar Reddy Reacted On The Party Change - Sakshi

సాక్షి, నెల్లూరు: పార్టీ మార్పుపై ఉత్త ప్రచారాలపై నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

‘‘ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా..నాపై వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా.. అసెంబ్లీయా.. పార్లమెంట్‌ బరిలోనా అనేది అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పారు.

అలాగే.. పార్టీలో నెలకొన్న అసంతృప్త పరిణామాలపైనా అదాల స్పందించారు. అసంతృప్త నేతలను తాను స్వయంగా కలిసి నచ్చజెప్పే యత్నం చేసినా.. చర్చలు ఫలించలేదని చెప్పారాయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను కలిసి నచ్చజెప్పే యత్నం చేశా. వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాగుంట మాత్రం కాస్త సానుకూలంగానే స్పందించారని ఎంపీ ఆదాల తెలిపారు.

ఇదీ చదవండి: కొత్త గ్రూపులకు ‘సారథి’!

 
Advertisement
 
Advertisement