టీడీపీ ధనిక వర్గాల పార్టీ: ఎమ్మెల్యే వాసుపల్లి

సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీని ధనిక వర్గాల పార్టీగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ పేదల గుండె చప్పుడు వినే పార్టీ అని తెలిపారు. గణేష్ కుమార్ వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికిన సందర్భంగా విశాఖ వన్ టౌన్‌లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ మార్కెట్ దుర్గమ్మ గుడి తదితర ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. (చదవండి: చంద్రబాబు కడుపుమంటపై తమిళ పత్రిక కథనం)
ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని 16 నెలలు మదన పడ్డాడని, వైఎస్సార్‌సీపీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. ‘ఏడేళ్ల పాటు టీడీపీలో వున్నా.. అక్కడ డబ్బున్న వారికే ప్రాధాన్యత’ అంటూ ఆయన మండిపడ్డారు. భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇతర రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రజల్ని ఆదుకుంటున్నారని తెలిపారు. ‘జలకళ’ పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగు నింపారని వాసుపల్లి గణేష్‌కుమార్ పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి