
సాక్షి, ప్రకాశం జిల్లా: పోలీసుల నోటీసులపై దర్శి ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పందించారు. తాను ఎక్కడికి పారిపాలేదని.. పిల్లలను చూడటానికి హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. ‘‘పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తా.. పోలీసుల నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని బుచేపల్లి శిప్రసాద్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారంటూ పొదిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, నిరసనలు చేసి గొడవలు సృష్టించి.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల పై దాడి చేసిన వారిపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే కేసులు పెట్టి.. ఇప్పడు ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.