మేడిగడ్డపై ఉత్తమ్‌ సమీక్ష.. తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని వార్నింగ్‌

Minister Uttam Kumar Serious On Medigadda Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్‌ పనులు చేసిన ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎస్వీ దేశాయ్‌, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   

కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌..‘అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. 

పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top