‘కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారు’

Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu In Chittoor - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు: చంద్రబాబుకు పిచ్చి పతాకస్థాయికి చేరుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియడంలేదని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు బాగా తెలిసిన విద్యలని దుయ్యబట్టారు. మొదటినుంచి మోసాలు చేయడం చంద్రబాబుకు అలవాటని ఫైర్‌ అయ్యారు.

చదవండి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం

సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హెచ్చరించారు. కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. 17న ఫలితాలు వస్తాయని, అప్పుడు చంద్రబాబు ఏం చెప్తారో చూస్తామని అన్నారు. ఆయనతో పాటు ప్రచారంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top