‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’

మంత్రి జగదీష్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట: రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని.. బీజేపీ నాయకుల కుట్రల వెనుక కేంద్ర పెద్దల హస్తముందని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో నడవదన్నారు. బీజేపీ తన వికృత రూపం బయట పెడుతుందని మండిపడ్డారు.
చదవండి: స్పీకర్‌కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్‌పై సంచలన కామెంట్స్
తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ నాయకుల లక్ష్యమన్నారు. బీజేపీ నాయకులు చట్ట సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఎంపీ ఆరోపిస్తే తెలంగాణలో ఎందుకు దాడులు చేస్తున్నారు. బీజేపీ నేతల అరాచకాలను మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు.
మరిన్ని వార్తలు