‘రఘురామను అరెస్ట్‌ చేయటంలో ఎలాంటి తప్పులేదు’

Minister Balineni Srinivasa Reddy Slams MP Raghu Rama Krishnam Raju - Sakshi

సాక్షి, అమరావతి : ఎంపీ  రఘురామకృష్ణరాజును అరెస్ట్‌ చేయటంలో ఎలాంటి తప్పులేదని, ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. ఎంపీ రఘురామ అరెస్ట్ అనంతరం మంత్రి బాలినేని స్పందించారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. 

రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: శ్రీరంగనాథరాజు  
‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు గత 13 నెలలుగా నరసాపురం పార్లమెంట్ ప్రజలను వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారణ చేయాలి. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.

చదవండి : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top