
సాక్షి, విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. వ్యవస్థలన్నీ విశాఖపట్నం నుంచే పనిచేస్తాయని స్పష్టం చేశారు.
కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. వ్యవస్థలన్నీ విశాఖ నుంచే పనిచేస్తాయి. మే 3వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. విశాఖ రాజధానిగా టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.